
డుమ్మాలకు చెక్ పడేనా!
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమలు
– 10లోu
337 స్కూళ్లలో 16,883 మంది విద్యార్థులు
జిల్లాలోని 9 మండలాల పరిధిలో 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 1,557 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఇప్పటివరకు 1,510 మంది ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ విధానం అమలులోకి వచ్చింది. సాంకేతిక సమస్యలతో మిగిలిన ఉపాధ్యాయులు ఇంకా ఎఫ్‌ఆర్‌ఎస్ పరిధిలోకి రాలేదు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే ఉదయం 9.15 గంటలకు ఒకసారి, సాయంత్రం 4.15 గంటలకు ఒకసారి యాప్‌లో వారి హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పక్కాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు గతేడాది నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తుండగా ఉపాధ్యాయులకు ఈ నెల 1నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ ద్వారా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్) యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్‌ఎంలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల హాజరు అమలులోకి వచ్చింది. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో టీచింగ్ మాడ్యుల్ టీచర్స్, నాన్ టీచింగ్ సిబ్బందిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌ను వేయాల్సి ఉంటుంది. పాఠశాల ఆవరణలో ఉండి హాజరువేసేలా జియోట్యాగింగ్ చేశారు. సెలవు పెడితే తప్పనిసరిగా యాప్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన సమయానుగుణంగానే ఈ యాప్‌లో ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలి.
● జిల్లా వ్యాప్తంగా 337 పాఠశాలల్లో 16,883 మంది విద్యార్థులు
● గతేడాది నుంచే విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్
● ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి
ప్రభుత్వం చర్యలు
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. గతేడాది నుంచి విద్యార్థుల హాజరును ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టగా తాజాగా టీచర్లకు సైతం ఆన్‌లైన్ విధానం ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషియన్ సిస్టమ్)ను ప్రవేశ పెట్టింది. దీని ద్వారా సమయానికి పాఠశాలకు ఉపాధ్యాయులు రావడంతో పాటు సమయం ముగిసే వరకు పాఠశాలలోనే ఉండాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
●