
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ఏటూరునాగారం: సీజనల్ వ్యాధులైన చికెన్‌గున్యా, డెంగీ జ్వరాలపై వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజనల్‌లో చికెన్ గున్యా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. జ్వరాల బారిన పడిన రోగులు వెంటనే వైద్యులు, సిబ్బందిని సంప్రదించే విధంగా రోగులను చైతన్య పర్చాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంసీహెచ్ టీమ్ డాక్టర్లు, ఎపిడమిక్ టీమ్ వైద్యులతో గ్రామాల్లో, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహించాలన్నారు. అందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. జ్వర బాధితులందరికీ రక్త పరీక్షలు చేసి సంబంధిత పీహెచ్‌సీలకు సమాచారం అందించాలన్నారు. రోజువారి రిపోర్టును జిల్లా కార్యాలయానికి పంపించాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి చంద్రకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, వైద్యులు సుమలత, యమునా, అఖిల, గౌతం పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు