
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ములుగు రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు సమస్యలపై చేస్తున్న ధర్నాకు ఆమె మంగళవారం మద్దతు ప్రకటించి మాట్లాడారు. జీవో నంబర్ 25ను సవరించాలన్నారు, ప్రతీ పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సబ్జెక్టు వర్కులోడ్‌కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తక్షణమే విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, గోవిందనాయక్, రమేష్ రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఓర్వలేకనే కాళేశ్వరంపై కుట్రలు
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ హయాంలో నిర్మించారని ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి హరీశ్‌రావు ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వివరించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాన్ని వీక్షించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచా రాన్ని తిప్పికొట్టాలన్నారు. కాళేశ్వరం కూలిందని అబద్ధపు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోరిక గోవింద్‌నాయక్, తాటి కృష్ణ, భిక్షపతి, రమేష్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి