
ఫాస్టాగ్ పేరుతో అక్రమ వసూళ్లు
గోవిందరావుపేట: అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి ఫాస్టాగ్ పేరుతో వాహనదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్ప డుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొదిళ్ల చిట్టిబాటు అన్నారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఫారెస్ట్ చెక్‌పోస్ట్ ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజూ జాతీయ రహదారిపై నడుస్తున్న వాహనాల నుంచి ఫారెస్ట్ అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతం టూరిస్ట్ కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి బొగత, మల్లూరులోని హేమాచలక్షేత్రం, మేడారం జాతరకు పర్యాటకులు వస్తుంటారని వివరించారు. ఇదే అదునుగా భావించిన ఫారెస్ట్ అధికారులు దురాశతో అక్రమంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఒక్కో వాహనానికి రూ.100 నుంచి 200వరకు వసూలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా పస్రా, ఏటూరునాగారం లో ఉన్న రెండు చెక్‌పోస్ట్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమ మల్లారెడ్డి, కొప్పుల రఘుపతి, తీగల ఆదిరెడ్డి, రత్నం ప్రవీణ్, నరేష్, రవీందర్, నాగరాజు, అరుణ్, కవిత, ఉదయ్, జానీ, శ్రావణ్, ప్రదీప్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
చిట్టిబాబు