
సత్వరమే పరిష్కరించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో బాధితులు అందజేసిన దరఖా స్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 65, గిరిజన దర్బార్‌లో 26 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.
గిరిజనదర్బార్‌లో వచ్చిన వినతులు
భూపాలపల్లి జిల్లా గుర్రంపేట గ్రామం నుంచి ములుగు జీసీసీలో గోదాం అసిస్టెంట్, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తుండగా నాలుగేళ్లుగా విధులు సక్రమంగా నిర్వహించడం లేదని తప్పుడు సమాచారం ఇచ్చి విధుల నుంచి తొలగించారని తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పీఓ చిత్రామిశ్రాకు గిరిజన దర్బార్‌లో విన్నవించారు. అలాగే కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామం నుంచి సీఆర్‌టీ ఉద్యోగం కోసం, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ నుంచి కాంట్రాక్ట్ అటెండర్‌ను ఏటూరునాగారం, వాజేడు గురుకులాలకు మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏటూరునాగారం మండలం వీరాపురం నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇప్పించాలని విన్నవించారు. మంగపేట మండలం నుంచి వికలాంగుల పింఛన్, విద్యుత్ మోటరుకు కనెక్షన్ ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితికి జెండాలు మంజూరు చేసేందుకు ఆదివాసీ దినోత్సవాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఊరట్టంలో ట్రైబల్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెంకటాపురం(కె) మండలం పాత్రాపురం బీట్ లో సాగులో ఉన్న అటవి భూమికి హక్కుపత్రాలు ఇవ్వాలని, వాజేడు మండలం గుమ్మడి దొడ్డిలో అక్రమంగా భూ మి మీదకు వస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీవో వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్‌కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేందర్ పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు
భూ సమస్యలు 20
గృహ నిర్మాణశాఖ 15
ఉపాధి కల్పన 07
పింఛన్లు 09
తదితర సమస్యలు 14
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో వినతుల వెల్లువ
స్వీకరించిన కలెక్టర్ దివాకర,
పీఓ చిత్రామిశ్రా
మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 91
ఈ ఫొటోలోనిది గోవిందరావుపేట మండల పరిధిలోని మొద్దులగూడెంకు చెందిన జల్లెల్ల రమేశ్. నిరుపేద కుటుంబానికి చెందిన అతను రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. తల్లితో పాటు నివసించేందుకు ఇల్లు కూడా లేదు. గతంలో కలెక్టర్ చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేయించారు. అది పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
భర్త అనార్యోగంతో ఉండగా భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాం. ఈ క్రమంలో తమ భూమిని కాజేశారని కోర్టును ఆశ్రయించాను. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులను తక్షణమే అమలు చేసి భూమి తిరిగి ఇప్పించాలి.
– ఉప్పల లక్ష్మీ, వెంకటాపురం(కె) మండలం

సత్వరమే పరిష్కరించాలి

సత్వరమే పరిష్కరించాలి

సత్వరమే పరిష్కరించాలి