
భక్తులు వర్సెస్ సిబ్బంది
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కొంతమంది భక్తులు, ఆలయ సిబ్బంది మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. గొడవకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రసీదు ఇవ్వాలిందే..
హైదరాబాద్(మెదక్)కు చెందిన భక్తులు సోమవారం సాయంత్రం లక్ష్మీనర్సిహస్వామిని దర్శించుకునేందుకు హేమాచలక్షేత్రానికి కారులో వచ్చారు. ఆలయానికి వచ్చిన వారి కారును మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆపి తాము ఆలయ సిబ్బందిమని కారు పార్కింగ్ రుసుము డబ్బులు ఇవ్వమని అడిగారు. రసీదు ఇస్తే తాము చెల్లిస్తామని చెప్పడంతో రసీదు ఇవ్వమని డబ్బులిస్తేనే కారును వెళ్లనిస్తామని దురుసుగా వ్యవహరించారు.. ఎదురు ప్రశ్నించిన తమపై దుర్బాషలాడి దాడి చేశారని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహించారని ఆరోపించారు. ఈ క్రమంలో సిబ్బందికి, భక్తులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అర్చకులు గుట్టపైకి చేరుకుని భక్తులకు, సిబ్బందికి సర్ధిచెప్పి గొడవను నివారించి భక్తులను అక్కడి నుంచి పంపించారు.
విచారణ జరిపి
చర్య తీసుకుంటాం..
గుట్టపై సిబ్బంది, భక్తుల మధ్య జరిగిన గొడవ విషయం తెలిసిందే. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్చలు జరుగకుండా శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం.
– శ్రావణం సత్యనారాయణ,
ఆలయ కార్యనిర్వహణ అధికారి
హేమాచల క్షేత్రంలో మద్యంమత్తులో
దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు
భక్తులే దుర్భాషలాడారు..
గుట్టపైకి వచ్చి భక్తుల కారుకు సంబంధించిన పార్కింగ్ రుసుము అడిగితే రసీదు అడిగారని.. రసీదు బుక్కు తెప్పిస్తుండగానే ఎందుకు ఇవ్వాలంటూ మద్యం తాగి ఉన్న భక్తులే తమపై దుర్భాషలాడి దాడి చేశారని సిబ్బంది అజయ్ తెలిపారు. భక్తులు చేసిన ఆరోపణలు అవాస్తవమని వివరించారు. ఈ గొడవకు సంబంధించిన ఫొటోలు సో షల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టా రని వివరించారు. గొడవకు సంబంధించిన ఫొటోలు, సిబ్బందికి చెందిన వాహనం అంటు అందులో మద్యం, వాటర్ బాటిళ్లు ఉన్న ఫొటోలను సైతం పెట్టడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.