
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో శ్రావణశోభ నెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం గర్భగుడిలో భక్తులు లక్షపత్రి పూజలను ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలో ఆలయం మారుమోగింది. దీంతో భక్తులు సందడి కనిపించింది.