
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
ములుగు రూరల్: సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం మున్సిపాలిటీ పరిధి గడిగడ్డ ప్రాంతంలో వైద్యశాఖ, ఆశాలతో కలిసి ఇంటింటి సర్వే చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడతారన్నారు. నీటి నిల్వలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్, యాంటీ లార్వా మందులు పిచికారీ చేయించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల ప్రభుత్వ పాటించాలని సూచించారు. మున్సిపాలిటీ నుంచి నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిసెంట్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
దివ్యాంగులు
దరఖాస్తు చేసుకోవాలి
ములుగు రూరల్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన పొంది సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపాధి, పునరావాస పథకం ప్రవేశపెట్టినట్లు జిల్లా సంక్షేమాధికారి తుల రవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 శాతం వైకల్యం కలిగి ఉండి 21 సంవత్సరాల నుంచి 55 వయస్సులోపు వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఆదాయ పరిమితి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉండాలని పేర్కొన్నారు. డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌బీఎంఎంఎస్.సీజీజీ.జీఓవీ వెబ్‌సైట్‌లో ఈనెల 14 నుంచి 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో పని వేళల్లో సంప్రదించాలని సూచించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణ
ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా చంద్రశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు డాక్టర్ మోహన్‌లాల్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 7న జనరల్ మెడిసిన్ విభాగంలో ములుగు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా విదులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్‌కు పదోన్నతి కల్పిస్తూ సూపరింటెండెంట్‌గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన సూపరిండెంట్‌ను పలువురు వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు భిక్షపతిరావు, తైలం గౌతమ్ తదితరులు ఉన్నారు.
వ్యాస రచన పోటీల్లో
విద్యార్థులు పాల్గొనాలి
ములుగు రూరల్: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించే వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని లీడ్ ఇండియా గ్లోబల్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ‘నివాస యోగ్యమైన భూగోళ పరిరక్షణ’ అంశంపై వ్యా స రచన పోటీలుంటాయని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
విద్యార్థినులకు
పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని ఏటీడీఓ దేశీరాం, జీసీడీఓ సుగణ అన్నారు. ఈమేరకు శుక్రవారం జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఆమె వెంట పాఠశాల హెచ్‌ం విజయలక్ష్మీ, వార్డెన్ బారోత్ అనిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఒకరిపై కేసు
భూపాలపల్లి అర్బన్: డీడబ్ల్యూఓపై అసత్యపు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పట్టణానికి చెందిన మాచర్ల సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ నరేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు