
గూడేల్లో మెరుగైన విద్యనందిస్తాం
ఏటూరునాగారం: గొత్తికోయ ఆదివాసీ చిన్నారులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధి చింతలమోరి ఆదివాసీ గ్రామాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ సంపత్ రావు సందర్శించారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన యూనిఫాంలు, పుస్తకాలు, విద్యా సామగ్రిని మంత్రితో పాటు కలెక్టర్ అదనపు కలెక్టర్లు పంపిణీ చేశారు. రాండ్ స్టాండ్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు తొమ్మిది పాఠశాలల్లోని 150 మంది పిల్లలకు అన్ని వస్తువులను అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణ ప్రాంతాల్లో మంత్రి కలెక్టర్ అధికారులు మొక్కలు నాటారు. కొండాయి గ్రామం వద్ద జరుగుతున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పరిశీలించారు.
వాగు దాటి.. పాఠశాలను ప్రారంభించి
మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ట్రాక్టర్‌పై జంపన్నవాగు దాటి ఎలిశెట్టిపల్లికి వెళ్లారు. ప్రభుత్వ నిధులు రూ.15లక్షలతో నిర్మించిన మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కాగా.. మండల కేంద్రంలోని ఎండి. వలీబాబా తండ్రి ఇటీవల మరణించడంతో మంత్రి సీతక్క బాదిత కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సంతోశ్‌తోపాటు పలువురు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మేడారంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్‌తో కలిసి మంత్రి సీతక్క శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రికి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం సీతక్క విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే మహా జాతర కోసం రూ.112 కోట్లతో ప్రాథమిక అంచనాలతో కలెక్టర్.. ట్రైబల్ వెల్పేర్ శాఖకు పంపించారని తెలిపారు.
ప్లేట్స్ తయారీ యూనిట్ ప్రారంభం
గోవిందరావుపేట: మండలంలోని మోట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో రాండ్‌స్టాండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ వారి సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్‌ను మంత్రి సీతక్క, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రవిచందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రహమాన్, మేడారం ఆలయ ఈఓ వీరస్వామి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ సురేశ్‌బాబు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఎన్జీఓ సంతోశ్, నాయకులు బొల్లు దేవేందర్, ఇర్ప సునీల్, వెంకన్న, రఘు, మనోజ్, రవి, రాము, రాండ్ స్టాండ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క
ట్రాక్టర్‌లో వాగుదాటి
పాఠశాల భవనం ప్రారంభం

గూడేల్లో మెరుగైన విద్యనందిస్తాం