
మందు పాతర ఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
వెంకటాపురం(కె): మందు పాతర పేలిన ఘటనలో గాయపడిన సోయం కామయ్య (45) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండల పరిధి ముకునూరు పాలెం గ్రామానికి చెందిన సోయం కామయ్య.. వెదురు తెచ్చుకోవడానికి ఈ నెల 4న కర్రె గుట్టల ప్రాంతంలోని అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు పడడంతో అది పేలింది. దాంతో తీవ్రంగా గాయపడిన సోమయ్యను చికిత్స నిమిత్తం వరంగల్, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో వైద్యం పొందుతూ గురువారం మృతిచెందాడు.