
సమాజ బాధ్యతగా తీసుకోవాలి..
మొక్కల సంరక్షణను పౌరులంతా బాధ్యతగా తీసుకోవాలని ములుగు ఫారెస్ట్ రేంజ్ అధికారి డోలి శంకర్ సూచిస్తున్నారు. వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనతో మినీ ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే.. వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖలకు టార్గెట్లు విధించింది. మొక్కల సంరక్షణకు ప్రధానంగా ట్రీగార్డులను వినియోగించాలి. నేలకు అనువైన మొక్కలు నాటడంతో పాటు న్యూట్రీషన్ అందించేలా చూడాలి. మొక్కలకు చెదలు రాకుండా గుళికలను వినియోగించాలి. నీడనిచ్చే చెట్ల ఎదుగుదలలో క్రూనింగ్ చేస్తే ఏపుగా పెరుగుతాయి. దీంతో పాటు మొక్కలకు కాంపోస్ట్ ఎరువుల్ని వినియోగిస్తే ఎదుగుదల బాగుంటుంది.