
‘కు.ని’పై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: యువతకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా విస్పోటనం వల్ల నిరుద్యోగం, పోషకాహార లోపం, జీవన ప్రమాణాల తగ్గుదల ఏర్పడుతుందన్నారు. జనాభా వృద్ధి వల్ల కలిగే సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం జిల్లాలో మాతా శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేసి 102 అంబులెన్స్ సేవలు అందిస్తుందన్నారు. ఈసేవలతో తల్లీబిడ్డ క్షేమంగా ఉంటున్నట్లు తెలిపారు. శాశ్వత కుటుంబ నియంత్రణ పాటించే వారి జాబితాను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారీగా కేంద్ర కార్యాలయానికి పంపి నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, పవన్‌కుమార్, నాగగణేశ్, సంపత్, సాంబయ్య, స్వరూపరాణి, సూపర్‌వైజర్లు సురేశ్, దేవేందర్, నిర్మల, దేవమ్మ, వినోద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిని అంతమొందించాలి
జిల్లాలో క్షయ వ్యాదిని అంతమొందించాలని జిల్లా వైధ్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ పౌరుడు క్షయ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. క్షయ వ్యాధి గాలిలో తుంపర్ల ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. క్షయ వ్యాది నివారణకు ప్రభుత్వం మందులు పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు