
‘బెస్ట్ అవైలబుల్’ డబ్బులేవి?
ములుగు రూరల్: నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అందిస్తుంది. స్కీంలో ఎంపికై న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు డే స్కాలర్, 5నుంచి విద్యార్థులకు హాస్టల్ వసతితో కూడిన విద్యను అందిస్తుంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీంకు చెందిన నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యజమానులు విద్యార్థుల తల్లితండ్రులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఏడాది బెస్ట్ అవైలబుల్ స్కీంకు ప్రైవేట్ యాజమాన్యాలు సుముఖత చూపడం లేదు.
మూడేళ్లుగా డబ్బులు పెండింగ్
జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు స్కీం ద్వారా 1వ తరగతి విద్యార్థులకు రూ.28 వేలు, 5వ తరగతి విద్యార్థికి రూ. 42 వేలను చెల్లిస్తుంది. ఇందులో ఎస్సీ విద్యార్థులు ఒకటవ తరగతిలో 74 మంది విద్యార్థులు, 5వ తరగతిలో 102 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎస్టీ విద్యార్థులు 203 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్న పాఠశాలలకు చెల్లించాల్సి న డబ్బులు గడిచిన మూడు సంవత్సరాలకు గాను రూ. 3కోట్ల 25లక్షల 92వేలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఎస్సీ విద్యార్థులకు రూ.కోటి 90లక్షల 68వేలు చెల్లించాలి. ఎస్టీ విద్యార్థులకు రూ.కోటి 35 లక్షల 24వేలు చెల్లించాలి
స్కీంపై అనాసక్తి
బెస్ట్ అవైలబుల్ స్కీం పథకం ద్వారా ఎంపికై న ఎస్టీ విద్యార్థులను జిల్లా కేంద్రంలోని సాధన హై స్కూల్, అరవింద హైస్కూల్, బ్రిలియంట్ హై స్కూల్‌లు కేటాయించారు. ఎస్సీ విద్యార్థులకు మంగపేట మండలం కమలాపూర్ ఆదర్శ పాఠశాల, జిల్లా కేంద్రంలోని అరవింద హై స్కూల్, సాధన హై స్కూల్‌కు ఎంపిక అయ్యారు. ఒక్కో పాఠశాలకు ఎంపికై న విద్యార్థుల ప్రకారం లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యాసంస్థలు నడపడం భారంగా మారుతుందని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో రూ.3.92 కోట్లు పెండింగ్
స్కీంపై ప్రైవేట్ పాఠశాలల
అనాసక్తి
ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లితండ్రులు

‘బెస్ట్ అవైలబుల్’ డబ్బులేవి?