ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం

Jul 8 2025 7:00 AM | Updated on Jul 8 2025 7:00 AM

ప్రజల

ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం

వాజేడు: ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వమని, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కలు అన్నారు. మండల పరిధిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, సీతక్కలు ముఖ్య అతిథులుగా హాజరై బాండ్‌ మొక్కజొన్న సాగు చేసి నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాలోని వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 1,521 ఎకరాల్లో బాండ్‌ మొక్కజొన్న సాగు చేసిన 671మందికి రూ,3,80,97,264 నష్ట పరిహారం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు నష్ట పోవడం మంచిది కాదని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. బాండ్‌ మొక్కజొన్న వల్ల నష్టపోయిన వారి వివరాలు సేకరించి సదరు కంపెనీలనుంచి పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం, అధికారులు కలిసి నడిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంటే ప్రతిపక్షం తట్టుకోలేకపోతుందన్నారు. ఇసుక పాలసీలో మార్పులను తీసుకురావడం మూలంగా దోపిడీ వ్యవస్థలను పూర్తిగా రూపుమాపామని, దానిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వాజేడులో మంత్రుల పర్యటన ఉండగా, దానికి అంతరాయం కల్పించడం కోసం ములుగులో బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అడ్డు తగిలే ప్రయత్నం చేశారన్నారు. మొక్క జొన్న రైతులకు పరిహారం రావడానికి ఎంతో కృషి చేశారని ములుగు కలెక్టర్‌ దివాకర టీఎస్‌ను అభినందించారు. ములుగు, భద్రాచలం, బొగత జలపాతాలను కలుపుతూ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, కలెక్టర్‌ దివాకర, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ ఉన్నారు.

వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యత

ఏటూరునాగారం: వనాలను కాపాడుకోవడం అందరి బాధ్యతని మంత్రి సీతక్క అన్నారు. చిన్నబోయినపల్లిలో ఈజీఎస్‌ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆమె సోమవారం ప్రారంభించి మొక్కలను నాటారు. అలాగే చిన్నబోయినపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.55లక్షలు, వెంకటాపురం బీటీ రోడ్డుకు రూ.1.60కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు.

రమేశ్‌ కుటుంబానికి మంత్రి పరామర్శ

గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయికి చెందిన చుక్క రమేష్‌ ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌లో ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు ఇస్తున్నారంటూ జరిగిన చర్చల విషయంలో తప్పుడు కేసు నమోదు చేశారనే భయంతో ఇటీవల ఆత్మహత్యకు పాల్ప డిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో రాజ కీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మంత్రి సీతక్క బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు అందించారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు,

ధనసరి సీతక్క

మొక్కజొన్న బాండ్‌ నష్ట పరిహారం చెక్కుల పంపిణీ

ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం1
1/1

ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement