
మంత్రులకు ఘనస్వాగతం
ములుగు రూరల్: జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్కలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టమ్మ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. తొలుత మంత్రులు గట్టమ్మ ఆలయం వద్ద సోమవారం పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, వంగ రవియాదవ్, ఎల్లావుల అశోక్, ఒజ్జల కుమార్, ఓంప్రకాష్, భిక్షపతి, రేవంత్‌యాదవ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం: సర్కారు బడులను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ దురిశెట్టి చంద్రకళ అన్నారు. మండల పరిధిలోని కొమురం భీమ్ నగర్‌లో నూతనంగా ప్రభుత్వం పాఠశాల మంజూరు చేయడంతో ఆ పాఠశాలను డీఈఓ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ముందుగా సావిత్రిభాయిపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాంనగర్ పంచాయతీలోని కొమురం భీమ్‌నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం వల్ల గిరిజనులకు విద్య చేరువులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నూతన పాఠశాలలను గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వి ద్యార్థులందరినీ ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని, విద్య ద్వారా మాత్రమే జీవితాలు మా రుతాయని సూచించారు. మిగతా రెండు పాఠశాలలైన రాయబంధం, గుండెంగవాయి పాఠశాలలను ఎంఈఓ మల్లయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ అర్షం రాజు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వి.సాంబశివరావు, సీఆర్‌పీలు బి.శ్రీధర్, సత్యారావు, గ్రామ పెద్దలు కృష్ణ, రమేష్, సంధ్య పాల్గొన్నారు.
పంటరుణాలు రీషెడ్యూల్ చేయాలని ధర్నా
ములుగు రూరల్: పంట రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ సోమవారం మండల పరిధిలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజద్ పాషా మాట్లాడారు. బ్యాంక్ అధికారులు రైతుల పంటరుణాలు రీ షెడ్యూల్ చేయాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రులకు ఘనస్వాగతం

మంత్రులకు ఘనస్వాగతం