కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి..
ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒ ప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్‌గౌడ్‌కు సూచించింది. మొదటి ప్రయత్నంలో రాకపోవడంతో కొంత నిరుత్సాహ పడ్డాడు. మళ్లీ ఎలేందర్‌గౌడ్‌ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్‌లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్‌తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు●
● భర్త మిలటరీలో మరణించినా..
బిడ్డలను కూడా పంపిన మరికొందరు..
● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న
ఉమ్మడి జిల్లా యువత
● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025


