వైభవంగా ధ్వజారోహణం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో ఆలయ ఇన్‌చార్జ్ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు మురళీకృష్ణమాచార్యుల బృందం ధ్వజా రోహణం కార్యక్రమాన్ని వైభవంగా శనివారం నిర్వహించారు. హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు ఉదయం 9గంటల నుంచి యాగశాలలో యాగ్నికుల బృందం అగ్నిప్రతిష్టాపన, సుదర్శన హోమం పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ నిర్వహించారు. అలాగే 10గంటలకు యాగశాలలోని ధ్వజపఠాన్ని మంగళవాద్యాలతో వేదపండితులు ప్రధానాలయంలోని స్వయంభూ స్వామి వారి ఆలయానికి చేర్చి ధ్వజస్తంభం వద్ద వేదమంత్రోచ్ఛరణ నడుమ పూజలు నిర్వహించి ధ్వజా రోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో 6నుంచి 8 గంటల వరకు భేరీపూజా, దేవతాహ్వానం, నివేదన తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గరుడప్రసాదం పంపిణీ
బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అనంతరం దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయంలో స్వయంభు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనిలో భాగంగానే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దీంతో గరుడ ప్రసాదం కోసం దంపతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధ్వజారోహనం కార్యక్రమంలో భక్తిశద్ధలతో పాల్గొని గరుడ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు మధనమోహన్, రామనర్సింహా, మణిదీప్, వెంకటాచార్యులు, భరద్వాజ్, అభిరామ్, విరంచి ఆలయ పూజా రులు శేఖర్‌శర్మ, పవన్‌కుమార్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ, అజయ్, గణేశ్ పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
దంపతులకు సంతానార్థం గరుడ ప్రసాదం పంపిణీ
వైభవంగా ధ్వజారోహణం


