‘ఎల్లమ్మ’ స్పెషల్‌ వీడియో.. దేవిశ్రీ సొంతూరులో జాతర చూశారా? | Yellamma Special Video: Devi Sri Prasad Shows The Spirit Of His Village Jathara | Sakshi
Sakshi News home page

‘ఎల్లమ్మ’ స్పెషల్‌ వీడియో.. దేవిశ్రీ సొంతూరులో జాతర చూశారా?

May 26 2026 4:50 PM | Updated on May 26 2026 5:04 PM

Yellamma Special Video: Devi Sri Prasad Shows The Spirit Of His Village Jathara

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే సినిమా టైటిల్‌తో పాటు హీరోగా దేవిశ్రీని పరిచయం చేస్తూ రిలీజ్‌ చేసి గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా  ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోని రిలీజ్‌ చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ సొంతూరు  వెదురుపాక, అక్కడ అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు.

తాను చెన్నైలో పెరిగినప్పటికీ.. నాన్నగారి సొంతూరు వెదురుపాక(తూర్పు గోదావరి జిల్లా) కు తరచూ వచ్చేవాడినని దేవి గుర్తు చేసుకున్నాడు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు వీడియో ద్వారా పంచుకున్నాడు. వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళల గురించి వివరిస్తూ.. ఆకారణంగానే తాను ‘ఎల్లమ్మ’ కథకి ఎస్‌ చెప్పానని ఆయన అన్నారు. ఈ వీడియోలో పల్లెటూరి వాతావరణాన్ని, పోలేరమ్మ, ఎల్లమ్మ జాతరను,  శివసత్తుల పూనకాలు, సాంప్రదాయ పులి వేషాలు, డప్పు వాయిద్యాలను చూపించారు. అంతేకాదు ఊరి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. డ్యాన్స్‌ కూడా చేశాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement