విక్కీ, కత్రీనా పెళ్లి చేసుకునే హోటల్‌ చరిత్ర ఏంటో తెలుసా..?

Vicky And Katrina Wedding Venue Has 700 Years History - Sakshi

Vicky And Katrina Wedding: బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్, విక్కీ కైషల్‌ వివాహం రాజస్థాన్‌ సవాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ హోటల్‌లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ 7-12 తేదీల మధ‍్య వీరి వివాహ వేడుకలు నిర్వహించనున్నారట. ఈ హోటల్‌లో బుకింగ్‌ కూడా పూర్తయిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వీఐపీల వివాహలను నిర్వహించడానికి చాలా ఈవెంట్‌ కంపెనీలు కలిసి పని చేస్తాయి. వేర్వేరు ఈవెంట్‌ల కోసం రకరకాల కంపెనీలను ఎంచుకుంటారని అధికారులు చెబుతున్నారు. 


అయితే ఈవెంట్‌ కంపెనీల ప్రతినిధులు సవాయ్‌ మాధోపూర్‌లోని వివిధ హోటళ్లలో గదులు వెతుకుతున్నారట. మరోవైపు కత్రీనా, విక్కీల బృందాలు కూడా పెళ్లికి సన్నాహాలు చేస్తున్నాయని తెలుస్తోంది. అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు 10 మంది సభ్యుల బృంద మంగళవారం సిక్స్‌ సెన్సెస్ బర్వారా కోటకు చేరుకుంది. హోటల్ యాజమాన్యం నుంచి అందిన సమాచారం ప్రకారం పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆ టీమ్ పర్యవేక్షిస్తుంది. వరుడు గుర్రం మీద కూర్చొని ఏ ప్రదేశం నుంచి వస్తాడు, మెహందీ ఎక్కడ నిర్వహిస్తారు మొదలైనవాటిని బృందం రెక్కీ చేస్తుందట. 

అయితే కత్రీనా, విక్కీ వివాహం చేసుకుంటున్న సిక్స్‌ సెన్సెస్‌ హోటల్‌ బర్వార్‌కు ప్రాచీన చరిత్ర ఉందట. ఇది 14వ శతబ్దంలో నిర్మించినట్లు చెప్పబడే చిత్రాలు ఇక్కడ ఉన్నాయని సమాచారం. ప్యాలెస్‌లో 48 లగ్జరీ సూట్‌లు ఉన్నాయి. ఇవి సుమారు 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతిని వర్ణిస్తాయి.

సమకాలీన రాజస్థానీ స్టైల్‌లో రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతను సూక్ష్మంగా పొందుపరిచారు. 700 ఏళ్ల నాటి రాచరిక పద్ధతి చిత్రాలను అక్కడ చూడవచ్చు. హోటల్‌ టెర్రస్‌ నుంచి పలు తోటలు, బార్వార గ్రామీణ దృశ్యాలు కనువిందు చేస్తాయి.

విక్కీ కౌషల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంతకాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌ను విక్కీ గానీ కత్రీనా గానీ తిరస్కరించలేదు, ధ్రువీకరించలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top