రజనీకాంత్‌ బర్త్‌డే.. రెండు సర్‌ప్రైజ్‌లు.. | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ బర్త్‌డే.. రెండు సర్‌ప్రైజ్‌లు..

Published Wed, Dec 13 2023 12:36 AM

Vettaiyan: Makers unveil title of Thalaivar 170 on Rajinikanth 73rd birthday - Sakshi

‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని అంటున్నారు రజనీకాంత్‌. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వేట్టయాన్ ’ (వేటగాడు అని అర్థం) టైటిల్‌ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. మంగళవారం రజనీకాంత్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్ ’ టైటిల్‌ వీడియోను విడుదల చేశారు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని రజనీకాంత్‌ చెప్పే డైలాగ్, విజువల్స్‌తో ఈ వీడియో సాగుతుంది. అమితాబ్‌ బచ్చన్ , ఫాహద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్  కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్  సంగీతం అందిస్తున్నారు.

లైకాప్రోడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుభాస్కరన్  నిర్మిస్తున్నారు. అలాగే లైకా ప్రోడక్షన్స్ సంస్థలో రజనీకాంత్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘లాల్‌ సలామ్‌’. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్  భాయ్‌ పాత్రలో రజనీకాంత్‌ నటిస్తున్నారు. రజనీ బర్త్‌ డే సందర్భంగా మొయిద్దీన్  భాయ్‌ పాత్రకు సంబంధించిన యాక్షన్  టీజర్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలే కాకుండా.. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement