పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి | Varun Tej, Lavanya Tripathi Blessed With a Baby Boy | Sakshi
Sakshi News home page

తండ్రయిన వరుణ్‌ తేజ్‌.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి

Sep 10 2025 2:52 PM | Updated on Sep 10 2025 4:22 PM

Varun Tej, Lavanya Tripathi Blessed With a Baby Boy

టాలీవుడ్‌ స్టార్‌ దంపతులు వరుణ్‌ తేజ్‌ (Varun Tej)- లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. లావణ్య బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి కూడా 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ సెట్స్‌ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి వరుణ్‌- లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అటు అభిమానులు, సెలబ్రిటీలు సైతం సోషల్‌ మీడియా వేదికగా వరుణ్‌ జంటకు విషెస్‌ చెప్తున్నారు.

లవ్‌ మ్యారేజ్‌
వరుణ్‌-లావణ్యలది ప్రేమ వివాహం. 2017లో మిస్టర్‌ సినిమాలో తొలిసారి జంటగా నటించారు. తర్వాత అంతరిక్షంలోనూ యాక్ట్‌ చేశారు. ఈ సినిమాల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడింది. అది ప్రేమగా మారడంతో కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. తర్వాత పెద్దలనొప్పించి 2023 నవంబర్‌ 1న పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్‌ తేజ్‌ చివరగా గతేడాది మట్కా సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 

ప్రస్తుతం #VT15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్‌ హీరోయిన్‌. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement