
తెలుగు హీరో, బిగ్‌బాస్ ఫేమ్ వరుణ్ సందేశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేశాడు. కొన్నిరోజుల క్రితం తమ సొంతింటి కల నెరవేరిందని వరుణ్ భార్య వితికా షేరు చెప్పుకొచ్చింది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది కదా. ఇప్పుడు ఈ జంట.. సందడిగా గృహప్రవేశం చేశారు. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. తర్వాత కాలంలో తనతో పాటు నటించిన వితికా షేరుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ బిగ్‌బాస్ 3వ సీజన్‌లో జంటగా పాల్గొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం తను కొత్త ఇల్లు తయారైందని చెప్పి వితికా షేరు పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)
'సొంత ఇల్లు ఉండాలనేది నా కల, అందుకే ఈ ఇంటి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూశాను. ఇన్నిరోజులకు నా కల నెరవేరింది' అని వితికా షేరు చెప్పింది. ఇప్పుడు భర్తతో కలిసి గృహప్రవేశం చేసింది. ఈ వేడుక కోసం అమెరికాలో ఉంటున్న వరుణ్ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. కుటుంబమంతా కలిసి తొలుత తిరుమల దర్శనం చేసుకున్నారు. తాజాగా సోమవారం ఉదయం కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. పూజ, హోమం లాంటి కార్యక్రమాలు చేశారు.
ఈ గృహప్రవేశానికి బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి, శివజ్యోతి, హిమజ తదితరులు వచ్చారు. అలానే మెగాడాటర్ నిహారిక కూడా విచ్చేసింది. వితికా షేరుకి నిహారిక బెస్ట్ ఫ్రెండ్. ఈ క్రమంలో ఇన్ స్టాలో వరుణ్-వితిక కొత్త ఇంటి గురించి ఈమె పోస్ట్ కూడా పెట్టి కంగ్రాట్స్ చెప్పింది.
(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)

