వైష్ణవ్‌ చేతి మూడు సినిమాలు.. ప్రముఖ దర్శకుడితో..

Vaishnav Tej Become Busy Hero In Tollywood With Movie Offers - Sakshi

పంజా వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. తొలిసారిగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై బాక్సాఫిసు వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జేట్‌లో చేరి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్‌ చేశాడు వైష్ణవ్‌. దీంతో వైష్ణవ్‌కు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్‌ ‘ఉప్పెన’తో పాటు  దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్‌ ‘ఉప్పెన’ విడుదలకు ముందే కంప్లీట్‌ చేయడం విశేషం.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటోంది. అంతేగాక వైష్ణవ్‌ తన మూడవ సినిమాకు కూడా సంతకం చేశాడట. మనం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నూతన దర్శకుడి డైరెక్షన్‌లో వైష్ణవ్‌ తదుపరి సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమచారం. ఇక వీటితో పాటు వైష్ణవ్‌ నిర్మాత బీవీ ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిచే మరో మూవీకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. దీంతో తొలి సినిమాతోనే అంత్యంత క్రేజ్‌ను సంపాదించుకున్న వైష్ణవ్‌ వరుస సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్‌ బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ దర్శకుడికి, హీరోయిన్‌ కృతి శేట్టికి కూడా పలు దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు, ఖరిదైన బహుమతులు అందుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: 
మూవీలో చరణ్‌ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్‌

రికార్డులు తిరగరాసిన ఉప్పెన
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top