‘జలజల పాతం’‌ మేకింగ్‌ కష్టాలు, వీడియో వైరల్

Uppena Movie Team Release Jala Jala Patham Nuvvu Making Video - Sakshi

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్‌ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్‌ సీన్స్‌, పాటల మేకింగ్‌ వీడియోలను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్‌ సాంగ్‌ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది చిత్ర యూనిట్‌.

సిల్వర్ స్క్రీన్‌పై సముద్రం మధ్యలో హీరోహీరోయిన్లు పండించిన రోమాన్స్‌ అంతా ఇంతా కాదు. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పడానికి ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఫుల్‌ సాంగ్‌కు వచ్చిన వ్యూస్‌ యే నిదర్శనం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ పాట ఫుల్‌ వీడియోను ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలై గంటల వ్వవధిలోనే లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది. అంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ పాట మేకింగ్ కోసం మూవీ టీం బాగానే చేమటోడిచ్చినట్లు తెలుస్తోంది ఈ తాజా మేకింగ్‌ వీడియో చూస్తుంటే. ఇక సహజమైన సముద్రాన్ని చూపించేందుకు మన దర్శకుడు బుచ్చి ఎంతగా కృషి చేశారో మీరే చూడండి.

చదవండి: 
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ డిలీటెడ్‌ సీన్‌.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top