
సూపర్‌స్టార్ సూర్యకుమార్ తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్నారు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేశ్‌బాబు .పి దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్ అండ్ టీ–సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సినీ సూపర్‌స్టార్ సూర్య కుమార్ పాత్రలో ఉపేంద్ర, ఈ హీరో ఫ్యాన్ పాత్రలో రామ్ నటిస్తున్నారని తెలిసింది. గురువారం ఉపేంద్ర బర్త్ డే సంద ర్భంగా, ‘హ్యాపీ బర్త్ డే ఆంధ్ర కింగ్’ అంటూ, ఆయన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నవంబరు 28న విడుదల కానుంది.