
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెన్స్ చిత్రం మార్కో. గతేడాది రిలీజైన ఈ సినిమా మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది.
మార్కో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో మేకర్స్ పుల్ బిజీ అయిపోయారు. తాజాగా లార్డ్ మార్కో టైటిల్ను మలయాళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా నమోదు చేశారు. దర్శకుడు హనీఫ్, నిర్మాత షరీఫ్ ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మార్కో హీరో ఉన్ని ముకుందన్ పేరు లేకపోవడం మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్ని ప్లేస్లో మరో హీరోను తీసుకొస్తున్నారా? అనే చర్చ మొదలైంది. దీంతో ఈ మూవీలో మమ్ముట్టి, యశ్, పృథ్వీరాజ్, హృతిక్ రోషన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. లేదంటే మలయాళంలో ఎవరైనా స్టార్ హీరోతో ప్లాన్ చేయనున్నారని టాక్.
అయితే ఇప్పటికే మార్కో సీక్వెల్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉన్ని ముకుందన్ ప్రకటించారు. ఈ మూవీపై విపరీతమైన నెగెటివిటీ రావడంతో ఈ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. మార్కో సిరీస్‌ను కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. మార్కో కంటే మంచి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వెల్లడింతారు. అందుకే ఉన్ని ముకుందన్ను సీక్వెల్ నుంచి మేకర్స్ తప్పించినట్లు తెలుస్తోంది.
కాగా.. 2024 డిసెంబర్‌లో విడుదలైన ‘మార్కో చిత్రంలో వయొలెన్స్ విపరీతంగా ఉన్నట్లు టాక్ వినిపించింది. దీంతో కొందరు మార్కో చిత్రంపై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాగా.. తెలుగు వెర్షన్ జనవరి 1న, తమిళ వెర్షన్ జనవరి 3న థియేటర్లలోకి వచ్చింది.
Director Haneef Adeni and Producer Shareef Muhammed have registered the title '#LordMarco' at the Film Chamber. #UnniMukundan is not part of the project. Who do you think will lead in #Marco2? Any guesses? pic.twitter.com/va4OpaACf8
— AB George (@AbGeorge_) September 17, 2025