
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ యుకె కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న సన్మానించనున్నారు.
సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ.. దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మార్చి 19న ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకుంటారు. సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా చిరును అభినందిస్తున్నారు.
బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె లో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంతుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి గారు అందుకోనుండటం విశేషం.

Comments
Please login to add a commentAdd a comment