'చరిత్ర పునరావృతం'.. త్వరలో తుంబాడ్‌ 2 | Tumbbad 2 Movie Announced: Sohum Shah Shares Teaser | Sakshi
Sakshi News home page

Tumbbad 2 Movie: సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీకి సీక్వెల్‌.. టీజర్‌ చూశారా?

Sep 14 2024 6:47 PM | Updated on Sep 14 2024 7:48 PM

Tumbbad 2 Movie Announced: Sohum Shah Shares Teaser

కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి చిత్రమే తుంబాడ్‌. హారర్‌ జానర్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఈ సినిమా 2018లో విడుదలైంది. అప్పుడు మరీ అంత ఆదరణ లభించలేదు కానీ ఓటీటీలో మాత్రం జనం విపరీతంగా చూశారు. తాజాగా ఈ సినిమాను రీరిలీజ్‌ కూడా చేశారు. బాలీవుడ్‌లో ఫ్రెష్‌గా రిలీజ్‌ చేసిన సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు తుంబాడ్‌ రాబట్టడం విశేషం.

చరిత్ర పునరావృతం
తాజాగా తుంబాడ్‌ మేకర్స్‌ ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించారు. ఈ మేరకు తుంబాడ్‌ చిత్ర హీరో సోహమ్‌ షా చిన్న టీజర్‌ కూడా వదిలారు. ఇందులో కాలం ఎన్నటికీ ఆగదు.. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇండియన్‌ సినిమాలోనే గ్రేటెస్ట్‌ మూవీ తుంబాడ్‌. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ రాబోతుందంటే ఆగలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈసారి మరిన్ని ట్విస్టులు
ఈ సీక్వెల్‌ గురించి హీరో, నిర్మాత సోహమ్‌ షా మాట్లాడుతూ.. తుంబాడ్‌ 2తో ఆడియన్స్‌కు మరింత అద్భుతమైన అనుభూతిని అందించాలనుకుంటున్నాం. ఈసారి మరిన్ని ట్విస్టులు ఉండనున్నాయి. అత్యాశకు పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మరింత లోతుగా, వివరంగా చూపించనున్నాం అని పేర్కొన్నాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement