'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా! | Trollers Target Vijay Devarakonda Family Star Movie OTT | Sakshi
Sakshi News home page

Family Star OTT: ట్రోలర్స్ దండయాత్ర.. విజయ్ దేవరకొండ బలి

Apr 27 2024 1:09 PM | Updated on Apr 27 2024 1:09 PM

Trollers Target Vijay Devarakonda Family Star Movie OTT

విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి అడ్డంగా బుక్కపోయాడు. పాపం ట్రోలర్స్ దెబ్బకు ఇంకో రౌండ్ బ్యాండ్ పడుతోంది. థియేటర్ రిలీజ్ టైంలో కేవలం మాటల వరకే పరిమితమవగా.. ఇప్పుడు స్క్రీన్ షాట్స్, వీడియోలు పోస్ట్ చేసి మరీ సినిమా పరువు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అయిపోతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?

ఉగాది కానుకగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ థియేటర్లలో రిలీజైంది. కుటుంబ నేపథ్య కథ కావడంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది కదా అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజుకి సీన్ అర్థమైపోయింది. జనాలు పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయిందని అన్నారు. కానీ అందులో నిజమేంటనేది ఆయనకే తెలియాలి.

ఎందుకంటే తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' వచ్చేసింది. అయితే సినిమా చూసిన చాలామంది నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. అలానే విలన్ రవిబాబుకి వార్నింగ్ ఇచ్చే సీన్‌లో హీరో డైలాగ్స్‌ వరస్ట్‌గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ వల్ల దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి బలైపోతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement