త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..! | Trisha shares witty post as link-up rumours with CM Vijay | Sakshi
Sakshi News home page

Trisha: త్రిషపై రూమర్స్.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..!

Jun 2 2026 3:15 PM | Updated on Jun 2 2026 5:17 PM

Trisha shares witty post as link-up rumours with CM Vijay

విజయ్ సీఎం అయ్యాక త్రిష పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆమె బర్త్‌ డే రోజే ఫలితాలు రావడం మరింత కలిసొచ్చింది. విజయ్ గెలుస్తాడన్న ధీమాతో త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ సీఎం ‍అయ్యాక కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్‌గా శారీలో కనిపించింది. వీరిద్దరిపై ఎన్నికల ముందు నుంచే డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే వీర్దిద్దరు జంటగా వెళ్లి అజిత్ కుమార్‌ను పరామర్శించారు.

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆమె తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తన పెట్‌ డాగ్‌ ఫోటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చింది. నా విషయాల్లో నేను అనుమతించే ఏకైక ముక్కు ఇదే అంటూ డాగ్‌ ఫోటోను షేర్ చేసింది. ఇది చాలా ఫన్నీగా ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్‌ను ఉద్దేశించే అలా పెట్టారని నెటిజన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది.

అంతేకాకుండా త్రిష తన మ్యాజికల్ మే అని మే నెల ఫోటోలను కూడా పంచుకున్నారు. ఆ ఫోటోల వరుసలో పుట్టినరోజు క్షణాలు, పువ్వులు, సెల్ఫీలు, వ్యక్తిగత స్నాప్‌షాట్‌లు, ఆమె పెంపుడు కుక్క  చిత్రాలు ఉన్నాయి. "మ్యాజికల్ మే నెల నుంచి మరికొన్ని చిత్రాలు.. వీటిని చూసి నేను చాలా కాలం పాటు నవ్వుతూ ఉంటాను అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement