మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్‌.. పోస్టర్ లాంఛ్‌! | Sakshi
Sakshi News home page

Malle Mogga Success Meet: మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్‌.. పోస్టర్ లాంఛ్‌!

Published Mon, May 20 2024 10:02 PM

Tollywood Movie Malle Mogga Success Meet

రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మల్లెమొగ్గ. తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తథాస్తు మూవీ పోస్టర్‌ను లాంఛ్‌ చేశారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ ..' ‘మల్లె మొగ్గ’ విజయంవంతం కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తోట వెంకట నాగేశ్వరరావు జీవితంలో చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. హీరో రామ్ తేజ్ ఎనర్జిటిక్‌గా నటించాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు తప్పకుండా ఆదరణ పొందుతాయి. ‘మల్లె మొగ్గ’ సినిమా ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా టీమ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

నటుడు భానుచందర్ మాట్లాడుతూ ..'మల్లె మొగ్గ సినిమాలో మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి స్టోరీతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఈ కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉన్నాయి.సకుటుంబంగా ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాతో పాటు రామ్ తేజ్ చేస్తున్న తథాస్తు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నా' అని అన్నారు.

హీరో రామ్ తేజ్ మాట్లాడుతూ..' నన్ను హీరోగా చేసిన మా మామయ్య, మా డైరెక్టర్ తోట వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు. ఆయన పేరు, మా తాతయ్య పేరు నిలబెడతా. మల్లె మొగ్గ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ. మేము ఇకపై సిటీ నేపథ్యమున్న చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాం. మల్లె మొగ్గ సినిమాలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా' అని అన్నారు.

దర్శక, నిర్మాత తోట వెంకట నాగేశ్వరారవు మాట్లాడుతూ ..‘మల్లె మొగ్గ’ సినిమాకు ఆదరణ బాగుంది. సిటీలో థియేటర్స్ తక్కువగా దొరికాయి. రిలీజైన ప్రతి చోటా మూవీ బాగుందనే రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇది ఎమోషన్, సెంటిమెంట్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మేము ఇప్పుడు చేయబోయే తథాస్తు మూవీ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌'  అని అన్నారు. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement