టాలీవుడ్ కొత్త సినిమా.. రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో ప్రత్యక్షం | tollywood movie arey apandra release In youtube | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ కొత్త సినిమా.. రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో ప్రత్యక్షం

Jun 2 2026 8:03 PM | Updated on Jun 2 2026 8:36 PM

tollywood movie arey apandra release In youtube

ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా ఇచ్చి ఇలా వెళ్తున్నాయి. థియేటర్ నుంచే మాయం కాగానే సడన్‌గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రిలీజైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలు కేవలం వారాల్లోపే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే యూట్యూబ్‌లోకి వచ్చేసింది. ఉచితంగానే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. 

సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం అరేయ్ ఆపండ్రా.  మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించారు.  ఈ సినిమా కి ఎస్.ఎస్ వెంకటేశ్ సంగీతమందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement