Vijay Thalapathy New Movie In Telugu: Vamsi Paidipally And Vijay Upcoming Movie In Tollywood - Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాకి సై?

May 4 2021 3:26 AM | Updated on May 4 2021 10:32 AM

Tollywood hit director Vamshi Paidipally to direct Vijay in his next film - Sakshi

తమిళ హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత నాలుగేళ్లుగా విజయ్‌ నటించిన చిత్రాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్‌ వంటి చిత్రాలు విజయ్‌కి ఇక్కడ అభిమానులను సంపాదించిపెట్టాయి. ఈ చిత్రాలకు లభించిన ఆదరణను చూసి, తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయాలని నిర్ణయించుకున్నారట విజయ్‌.

‘బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి చెప్పిన కథను విన్నారట. ఈ కథ విజయ్‌కి నచ్చిందని, త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

చదవండి: మనవరాలికి ఇళయరాజా సంగీత పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement