టాలీవుడ్‌లోకి మరో విలన్‌..  ఆసక్తిరేకెత్తిస్తున్న టైగర్‌ శేషాద్రి లుక్‌ | Tiger Seshadri Looks As Antagonist In Nataratnalu Generates Curiosity | Sakshi
Sakshi News home page

Nataratnalu: టాలీవుడ్‌లోకి మరో విలన్‌..  ఆసక్తిరేకెత్తిస్తున్న టైగర్‌ శేషాద్రి లుక్‌

Mar 12 2023 4:16 PM | Updated on Mar 12 2023 4:16 PM

Tiger Seshadri Looks As Antagonist In Nataratnalu Generates Curiosity - Sakshi

ఓ సినిమాకు హీరో పాత్ర ఎంత ముఖ్యమో.. విలన్‌ పాత్ర కూడా అంతే ముఖ్యం. కథానాయకుడితో పోటాపోటిగా విలన్‌ పాత్ర ఉంటేనే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ప్రతి సినిమాలోనూ హీరో, విలన్.. ఆ ఇద్దరూ తలపడే సీన్స్ మూవీలో మేజర్ హైలైట్ అవుతుంటాయి. అలా ఇప్పటికే తెలుగు తెరపై ఎందరో విలన్స్ లైమ్ లైట్ లోకి రాగా.. తాజాగా టైగర్ శేషాద్రి అనే మరో విలన్‌ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. నటరత్నాలు అనే సినిమాతో విలన్ గా ఆయన పరిచయం కాబోతున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విలన్ టైగర్ శేషాద్రి లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో గుబురు గడ్డంతో ఎంతో సీరియస్ లుక్ లో ఆయన కనిపిస్తున్నారు. నుదుట పొడవాటి బొట్టు, మెడలో పులిగోర్లతో కూడిన లాకెట్ ఆయన మ్యానరిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. విలన్ కి ఉండాల్సిన సీరియస్‌నెస్, శరీర సౌష్టవం ఆయనలో కనిపిస్తున్నాయి. ఈ లుక్ చూస్తుంటే నటరత్నాలు సినిమాలో టైగర్ శేషాద్రి విలన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. 

ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై చందన ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డా. దివ్య నిర్మాతగా, ఆనందాసు శ్రీ మణికంఠ సహ నిర్మాతగా, యలమాటి చంటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు శంకర్ మహదేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. సుదర్శన్, ఇనయ సుల్తానా, రంగస్థలం మహేష్‌, టైగర్ శేషాద్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement