కీడా కోలా నవ్విస్తుంది

Tharun Bhaskar at Keeda Cola Trailer Launch - Sakshi

–  రానా

తరుణ్‌ భాస్కర్‌ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్‌ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్‌ నండూరి, శ్రీపాద్‌ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్‌ భాస్కర్‌ వంటి ఫిల్మ్‌ మేకర్స్‌ చాలా అరుదుగా ఉంటారు.

‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్‌డేట్స్‌ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్‌ ్ర΄÷డక్షన్స్‌లో చాలా సినిమాల రీమేక్స్‌ రైట్స్‌ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్‌ చేయడం లేదు. ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్‌ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు.

‘‘లాక్‌డౌన్‌ టైమ్‌లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్‌లో ఓ కీడా ఉంటే కన్‌జ్యూమర్‌ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్‌ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్‌గారితో సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్‌ వర్క్‌ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్‌ భాస్కర్‌తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top