డేటింగ్ రూమర్స్.. మళ్లీ జంటగా డైరెక్టర్-హీరోయిన్ | Tharun Bhascker And Eesha Rebba Relation Latest News | Sakshi
Sakshi News home page

Eesha Rebba: త్వరలో శుభవార్త చెబుతారా? రూమర్స్ నిజమేనా?

Jul 8 2026 6:00 PM | Updated on Jul 8 2026 6:12 PM

Tharun Bhascker And Eesha Rebba Relation Latest News

టాలీవుడ్ సెలబ్రిటీలు జంటగా కనిపించారంటే వాళ్లిద్దరి గురించి పుకార్లు మొదలైపోతాయి. అలానే రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయిన జంట తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా. వీళ్లు ప్రేమలో ఉన్నారని రూమర్స్ గత కొన్నాళ్ల నుంచి వస్తున్నాయి. వాటిని నిజం అని చెప్పలేదు అలా అని ఖండించలేదు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వీళ్లిద్దరూ జంటగా కనిపించారు.

(ఇదీ చదవండి: 'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే)

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తీస్తున్నాడు. మరోవైపు తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాతోనూ డేటింగ్‌లో ఉన్నాడనే టాక్ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తరుణ్.. ఈషా నాకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పాడు. సరైన టైంలో పూర్తి వివరాలు బయటపెడతానని పేర్కొన్నాడు. లేటెస్ట్‌గా మరోసారి కనిపించడంతో మరోసారి ఈ జంట చర్చనీయాంశమైపోయారు.

(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement