అప్పట్లో తెలుగు హిట్ సినిమాల్లో.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా! | Sakshi
Sakshi News home page

Guess The Actress: స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్.. ఇప్పుడేమో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం

Published Wed, Mar 13 2024 2:20 PM

Telugu Actress Mumtaj Latest Pics And Family Details - Sakshi

ఈమె ప్రముఖ నటి. తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా బోలెడన్ని సినిమాలు చేసింది. దక్షిణాదిలో మిగతా భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. అయితే ఈమె పేరు చెబితే సరిగా గుర్తురాకపోవచ్చు. కానీ కొన్ని స్పెషల్ సాంగ్స్ పెడితే మాత్రం ఈమె ఎవరనేది టక్కున గుర్తుపట్టేస్తారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో సడన్‌గా సినిమాలు బంద్ చేసి, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు ముంతాజ్. ముంబయికి చెందిన ఈమె.. టీనేజ్‌లోనే ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది. 'ఖుషీ', 'అత్తారింటికి దారేది' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మాస్ స్టెప్పులేసింది ఈమెనే.

(ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య)

నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది.

సినిమాలు చేయనప్పటిక.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. అయితే అప్పట్లో ఈమెని చూసి, ఇప్పుడు హిజాబ్‌లో చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ముంతాజ్ ఎవరో తెలుసుకుని అవాక్కయ్యారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Advertisement

తప్పక చదవండి

Advertisement