Tammareddy Bharadwaja: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja Review On Bimbisara, Sita Ram Movie - Sakshi

బింబిసార, సీతారామం చిత్రాల సక్సెస్‌పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు మంచి విజయం సాధించాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్‌ రాబడుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఈ చిత్రాలు హిట్‌ కావడంతో తెలుగు పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాల హిట్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బింబిసార, సీతా రామం హిట్‌ అయ్యాయని ఆనందపడిపోకూడదని, మూడు నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకూడదని వ్యాఖ్యానించారు.  తాజాగా ఈ రెండు సినిమాలు చూసిన ఆయన తన రివ్యూ ఇచ్చారు.

చదవండి: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ మూవీ రివ్యూ

సీతారామం మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యమన్నారు. ఫస్ట్‌హాఫ్‌లో కశ్మీర్‌ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్‌. ఓ అనాథను జావాన్‌గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్‌ అన్నారు. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్‌ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం బింబిసార మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ రెగ్యులర్‌ కమర్షియల్‌ కథేనన్నారు. కథలో కొత్తదనం లేకపోయిన డైరెక్టర్‌ వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. అయితే టైం ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369తో పోల్చి చూడటం సరికాదన్నారు.

చదవండి: చిక్కుల్లో స్టార్‌ హీరో దర్శన్‌, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత

ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలీకే లేదన్నారు. బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని చెప్పారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్‌ చూసి సంబరాలు చేసుకోకుండ, సినిమా రన్‌టైం పెంచాలన్నారు. థియేటర్లో రెగ్యులర్‌ ఆడియన్స్‌ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే ‘50 రోజుల పాటు సినిమాలు ఎందుకు ఆడటం లేదని? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందురు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లను బతికిస్తాయి. సినిమాకు పూర్వ వైభవం వస్తోంది’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top