Varasudu-Thunivu Movie: వారసుడు, తునివు థియేటర్‌ యాజమాన్యాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్‌

Tamil Nadu Government Send Notice to Varisu, Thunivu Theater Owners - Sakshi

తమిళ స్టార్‌ హీరోలు విజయ్, అజిత్‌ చిత్రాల విడుదల చేసిన థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. విజయ్‌ నటించిన వారిసు, అజిత్‌ తుణివు చిత్రాలు పొంగల్‌ సందర్భంగా ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ముఖ్యంగా 11, 12వ తేదీల్లో మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది.

చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చిందా?

అదేవిధంగా థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయరాదని, వాటికి పూజలు, పాలాభిషేకాలు వంటివి నిర్వహించరాదని, సినిమా టికెట్లను అధిక రేట్లకు విక్రయించకూడదని నిబంధనలు విధించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ థియేటర్‌ యాజమాన్యం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక ఆటలను ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లను బ్లాక్‌లో రూ.1000, రూ.2000 వరకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే థియేటర్ల ముందు అభిమానులు రచ్చ రచ్చ చేశారు.

చదవండి: అల్లు అర్జున్‌కు దుబాయ్‌ ప్రభుత్వం అరుదైన గౌరవం

కాగా నటుడు విజయ్‌ నటించిన వారిసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే  రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు, అజిత్‌ నటించిన తుణివు రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇలాంటి అన్ని విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వారు సరైన వివరణ ఇవ్వకుంటే 1957లోని ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top