
నటి వేదిక గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక సినీ కవి నటి ఇలియానాను చూసి నడుం ఎక్కడే నీకు నవలామణి అనే పాటను రాశారు. అయితే ఆ పాట నటి వేదికకు సరిగ్గా సరిపోతుంది. ఈమె కూడా అంత స్లిమ్‌గా తన అందాన్ని కాపాడుకుంటారు. ఈమె బహు భాషా కథానాయకి. తమిళం ,తెలుగు, మలయాళం, కన్నడం ,హిందీ మొదలగు భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు.
మదరాసి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన వేదిక ఆ తర్వాత ముని, చక్కరకట్టి, కాళై, పరదేశి, కావ్య తలైవన్, కాంచన 3 తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో విజయదశమి, బాణం, రూలర్, బంగార్రాజు, రజాకార్, ఫియర్ వంటి మూవీస్‌లో నటించారు. అయితే స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈమె కథానాయకిగా నటించిన ఖజానా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ వయసు జస్ట్ 37 ఏళ్లు మాత్రమే.
దీంతో ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి అడిగిన ప్రశ్నకు వేదిక బదులిస్తూ తన జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారు తనతో చివరి వరకు ఉంటారని పేర్కొన్నారు. అందులో ఒకటి తన తల్లి ప్రేమ అని, అది తొలిప్రేమ అని, రెండవది నాట్యం అని చెప్పారు. నాట్యం అంటే తనకు పిచ్చి ప్రేమ అని చెప్పారు. తనకు విరామం దొరికినప్పుడల్లా డాన్స్ చేస్తానని చెప్పారు. ఈ రెండు ప్రేమలు తన జీవితంలో చివరి వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అయితే మగవారిపై ప్రేమ పుట్టదా అన్న ప్రశ్నకు అది కలిగినప్పుడు చూద్దాం అంటూ నటి వేదిక బదులిచ్చారు.