Tamil Actor Bose Venkat's Sister, Brother Passed Away On The Same Day - Sakshi
Sakshi News home page

Bose Venkat: ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం.. ఒకే రోజు ఇద్దరు మృత్యువాత

Jun 24 2023 2:24 PM | Updated on Jun 24 2023 2:42 PM

Tamil Actor Bose Venkat Sister, Brother Passed Away On The Same Day - Sakshi

తన సోదరి మృతదేహంపై పడి బోరున విలపించాడు. ఆమె అంత్యక్రియలు చేస్తున్న సమయంలో రంగనాథన్‌కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇ

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు బోస్‌ వెంకట్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు చెన్నైలో బోస్‌ వెంకట్‌ అక్క వలర్మతి గుండెపోటుతో మరణించింది. సోదరి మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వలర్మతి మరణవార్తను తట్టుకోలేకపోయిన రంగనాథన్‌ తన సోదరి మృతదేహంపై పడి బోరున విలపించాడు. ఆమె అంత్యక్రియలు చేస్తున్న సమయంలో రంగనాథన్‌కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇద్దరు తోబుట్టువులు మరణించడంతో బోస్‌ వెంకట్‌ కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

కాగా బోస్‌.. తమిళ సీరియల్స్‌, సినిమాల్లో.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు. మెట్టి ఆయిల్‌ సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన 2020లో వచ్చిన కన్ని మేడమ్‌ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా పలు సినిమాలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం అతడు స్మాల్‌ స్క్రీన్‌ యాక్టర్స్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: ఇళయరాజా వల్ల నా కెరీర్‌ ముగిసింది: చిన్ని చిన్ని ఆశ సింగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement