ప్రేమను పంచండి

Tamannaa states people need to show their positive side on social media - Sakshi

‘‘ప్రస్తుతం మనందరం ఓ పెద్ద సమస్యను (కరోనా) ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రేమని పంచాలి కానీ ద్వేషాన్ని కాదు’’ అంటున్నారు తమన్నా. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెగటివిటీ ఎక్కువ అవుతోందని, అందరూ పాజిటివ్‌ గా ఆలోచించాలని తమన్నా పేర్కొన్నారు. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘మనమెప్పుడూ చూడని ఓ విపత్తు ఇప్పుడు మన ముందు ఉంది. ఇలాంటి సమయంలో మనందరం పాజిటివ్‌ గానే ఉండాలి.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చాలా అంటే చాలా ద్వేషం కనిపిస్తోంది. అది చాలా మందిని ఇబ్బందికి గురిచేసేలా ఉంది. మరీ ముఖ్యంగా ట్రోలింగ్‌ ఎక్కువైంది. కానీ ఇలాంటి సమయంలో కావాల్సింది ద్వేషం కాదు.. ప్రేమ. ఒకరికి ఒకరం అండగా నిలబడాలి. సోషల్‌ మీడియా అనేది ఒకరికొకరం కనెక్ట్‌ అవ్వడానికి. దాన్ని సరిగ్గా వినియోగించుకుందాం. ఒకప్పుడు సోషల్‌ మీడియాలో ‘మంచి’ కనిపించేది. మళ్లీ ఇంతకు ముందులాగానే సోషల్‌ మీడియాలోనూ పాజిటివిటీనే పంచుదాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top