ఆఖరి రౌండ్‌ | Sakshi
Sakshi News home page

ఆఖరి రౌండ్‌

Published Mon, Jan 18 2021 12:28 AM

Taapsee shredding diet for Rashmi Rocket - Sakshi

పరుగు పందెంలో ఆఖరి రౌండ్‌కి వచ్చేశారు రష్మి.. ఫలితం ఏమైందన్నది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘రష్మి రాకెట్‌’. ఇందులో రష్మి అనే రన్నర్‌ పాత్రలో తాప్సీ కనిపిస్తారు. ఆఖర్ష్‌ ఖురానా దర్శకుడు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ గుజరాత్‌లో ప్రారంభం అయింది. ఫిబ్రవరి వరకూ సాగే ఈ షెడ్యూల్‌తో ‘రష్మి రాకెట్‌’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో అథ్లెట్‌గా కనిపించడం కోసం శరీరాకృతిని మొత్తం మార్చుకున్నారు తాప్సీ. కఠినమైన వ్యాయామాలు చేశారు. స్ట్రిక్ట్‌ డైట్‌ పాటించారు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement