
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు.
ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు.
పెళ్లి వీడియో లీక్..
తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు.
తాప్సీ సీనీ కెరీర్..
తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది.
A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T
— Bollywood Bubble (@bollybubble) April 3, 2024