నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది: వర్ష బొల్లమ్మ

Swathi Mutyam actress Varsha Bollamma interesting comments  - Sakshi

– వర్ష బొల్లమ్మ

‘‘నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే ఇష్టం. ‘స్వాతిముత్యం’ కథలో కొత్తదనం ఉంది. ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా   ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ అన్నారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘‘సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అలాగే కథ నచ్చడంతో ‘స్యాతిముత్యం’ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఇందులో భాగ్యలక్ష్మి అనే టీచర్‌ పాత్ర చేశాను.

బయట సరదాగా ఉంటాను, కానీ విద్యార్థుల ముందు కాస్త కఠినంగా ఉంటాను. నిజ జీవితంలోని నా గురువుల స్ఫూర్తితో ఈ సినిమాలో సహజంగా నటించాను.  ఇందులో గణేష్‌ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నా పాత్ర కొంచెం డామినేటింగ్‌గా ఉంటుంది. ప్రేక్షకులు మధ్యతరగతి అమ్మాయిగా నన్ను చూడటానికి ఇష్టపడుతున్నారనుకుంటున్నాను. అందుకే అలాంటి పాత్రలు  ఎక్కువ పేరు తీసుకొస్తున్నాయి. లక్ష్మణ్‌గారి రచన నాకు చాలా నచ్చింది. టాప్‌ హీరోయిన్‌ అవ్వాలనే ఆలోచన నాకు లేదు.. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుంది. కమర్షియల్‌ సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తాను. ప్రతినాయిక ఛాయలున్న సైకో పాత్ర బాగా చేయగలననే నమ్మకం ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో ‘కొమురం భీముడో..’ పాటలో ఎన్టీఆర్‌గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను ఫ్యా¯Œ . ప్రస్తుతం సందీప్‌ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాను. మరో రెండు తెలుగు, తమిళ సినిమాలు కూడా ఉన్నాయి’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top