దేవుడు-లాయర్‌గా సూర్య.. కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ | Suriya Karuppu Movie Trailer | Sakshi
Sakshi News home page

Suriya: కమర్షియల్ రూట్‌లోకి వచ్చేసిన సూర్య

May 10 2026 8:35 PM | Updated on May 10 2026 8:35 PM

Suriya Karuppu Movie Trailer

తమిళ హీరో సూర్య హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. గత రెండు చిత్రాలు 'కంగువ', 'రెట్రో' అయితే ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. వాటితో కాస్త భిన్నంగా చేద్దామని ప్రయత్నించాడు. కానీ వర్కౌట్ కాకపోయేసరికి మళ్లీ కమర్షియల్ రూట్‌లోకి వచ్చేశాడు. అలా చేసిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో ఈ గురువారం(మే 14) థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ ‍ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: బర్త్ డే గిఫ్ట్.. కొత్త ఇంట్లోకి యాంకర్ శ్రీముఖి)

ట్రైలర్‌లోనే దాదాపు స్టోరీ ఏంటనేది చెప్పేసే ప్రయత్నం చేశారు. ఓ కోర్టు. అందులో విలన్(ఆర్జే బాలాజీ), హీరోయిన్(త్రిష) లాయర్స్‌గా పనిచేస్తుంటారు. న్యాయం అంటూ ఎవరొచ్చినా సరే తిప్పించుకుంటూ ఉంటారు. దీంతో దేవుడు అయిన హీరో(సూర్య) లాయర్‌గా వస్తాడు. అటు సామాన్యులకు న్యాయం చేయడంతో పాటు విలన్ బెండు ఎలా తీశాడనేది కథలా అనిపిస్తుంది.

సూర్య, త్రిష హీరోహీరోయిన్లు కాగా.. దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గానూ చేశాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే తమిళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రేపో ఎల్లుండో తెలుగు ట్రైలర్ కూడా వదులుతారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు, హీరో విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తదితర విషయాల వల్ల సూర్య సినిమాపై కనీస బజ్ లేకుండా పోయింది. మరి ఇదైనా సూర్యకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?

(ఇదీ చదవండి: విషాదం.. అషురెడ్డి ఎమోషనల్ పోస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement