'సూపర్‌ గర్ల్‌' రిలీజ్‌ ఎప్పుడంటే? | Super Girl Movie Releasing in India on June 26 | Sakshi
Sakshi News home page

భారత్‌లో రిలీజ్‌కు రెడీ అయిన హాలీవుడ్‌ మూవీ

Jun 10 2026 7:16 AM | Updated on Jun 10 2026 9:10 AM

Super Girl Movie Releasing in India on June 26

డీసీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న హాలీవుడ్‌ మూవీ సూపర్‌ గర్ల్‌ జూన్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మిల్లీ ఆల్కాక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కొత్త డీసీ సినిమాటిక్‌ యూనివర్స్‌లో కీలక చిత్రంగా రూపొందింది. ఈ మూవీ వివరాలను నిర్మాత జేమ్స్‌ గన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. సూపర్‌ మ్యాన్‌తో పోలిస్తే సూపర్‌ గర్ల్‌ జీవితం ఎంతో కఠినమైనదని తెలిపారు. ప్రేమతో కూడిన కుటుంబంలో పెరిగిన సూపర్‌ మ్యాన్‌కు విశ్వంలోని మంచితనంపై నమ్మకం కలిగుండటం సులభమైంది. 

కానీ తన గ్రహం నాశనమవడం, తల్లిదండ్రుల మరణాన్ని కళ్లారా చూసిన సూపర్‌ గర్ల్‌కు అలాంటి నమ్మకం ఏర్పడటం అంత సులభం కాదన్నారు. ముఖ్యంగా సినిమాలో నటి కారా జోర్‌ ఎల్‌ వ్యక్తిగత వేదన, మానసిక సంఘర్షణలు, ప్రతీకారం, న్యాయం మధ్య జరిగే పోరాటం ప్రధానాంశాలుగా ఉంటాయన్నారు. తన పెంపుడు కుక్క క్రిప్టోను కాపాడేందుకు సూపర్‌ గర్ల్‌ చేసే అంతరిక్ష ప్రయాణం కథలో కీలకంగా మారుతుందన్నారు. ఈ చిత్రాన్ని వార్నర్స్‌ బ్రదర్స్‌ సంస్థ 3డీ ఫార్మాట్లలో ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement