ఓటీటీలో 'సు ఫ్రమ్‌ సో'.. అఫీషియల్‌ ప్రకటన | Su From So Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'సు ఫ్రమ్‌ సో'.. అఫీషియల్‌ ప్రకటన

Sep 6 2025 10:33 AM | Updated on Sep 6 2025 10:54 AM

Su From So Movie OTT Streaming Details

కన్నడ హిట్‌ సినిమా 'సు ఫ్రమ్‌ సో'(Su From So Movie) ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. షనీల్‌ గౌతమ్‌, సంధ్య, రాజ్‌ బి.శెట్టి తదితరులు నటించిన హారర్‌ కామెడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని క్రియేట్‌ చేసింది. ఈ మూవీకి కథ, దర్శకత్వం జేపీ తుమినాడ్‌ అందించారు. తెలుగులో ఆగష్టు 8న మైత్రీ మూవీ మేకర్స్‌ వారు విడుదల చేశారు.

కన్నడలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన  'సు ఫ్రమ్‌ సో' చిత్రం.. తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో సెప్టెంబర్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు ఆ ఓటీటీ సంస్థ అప్‌కమింగ్‌ సినిమా జాబితాలో 'సు ఫ్రమ్‌ సో'ను చేర్చింది.  కన్నడతో పాటు తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద ఏకం రూ.40కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

కథేంటి?
కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement