‘బాహుబలి 3’ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి సన్నాహాలు మొదలుపెట్టనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం లైవ్ యాక్షన్ ఫిల్మ్ కాదట. యానిమేటెడ్ వెర్షన్ లో ఉండబోతుందని, ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించరట. కానీ, ఆయన పర్యవేక్షణలోనే ‘బాహుబలి 3’ యానిమేటెడ్ వెర్షన్ వస్తుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ విషయాలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ రెండు భాగాలు (బాహుబలి:ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ ) కలిపి ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’గా ఈ నెల 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించగా రానా, అనుష్కా శెట్టి, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సినిమాని శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది.


