జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ వేరే లెవెల్: టీమిండియా మాజీ క్రికెటర్! | Sakshi
Sakshi News home page

Sreesanth On Jr NTR: 'ఎన్టీఆర్‌తో ఛాన్స్‌ వస్తే నటించాలనుంది'.. మాజీ క్రికెటర్ శ్రీశాంత్!

Published Wed, Feb 21 2024 7:48 PM

Sreesanth Open About Work with Jr NTR If Chance Will Come - Sakshi

టాలీవుడ్‌ యంగ్ టైగర్‌ ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అభిమానుల గుండెల్లో మ్యాన్‌ ఆఫ్ మాసెస్‌ అంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరోల్లో ఎన్టీఆర్‌ ముందు వరసలో ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్ షమీ తన అభిమానం చాటుకున్నారు. ఎన్టీఆర్‌ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. టాలీవుడ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ తన అభిమాన హీరోలని చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో క్రికెటర్‌ చేరిపోయారు. టీమిండియా మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీశాంత్‌ జూనియర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. మీరు చాలా బాగా డ్యాన్స్‌ చేస్తారని..  మీ నటన అద్భుతంగా ఉంటుందని చెప్పానని అన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వెళ్తూ తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని తెలిపారు. తెలుగులో ఎన్టీఆర్‌తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని శ్రీశాంత్ అన్నారు.  

శ్రీశాంత్ మాట్లాడుతూ.. 'ఆయనకు గుర్తు ఉందో లేదో తెలియదు కానీ.. ఓ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను కలిశా. అక్కడే ప్రియమణి, అల్లు అర్జున్‌ కూడా ఉన్నారు. నేను ఎన్టీఆర్‌ దగ్గరికి వెళ్లా. మీరు ‍డ్యాన్స్ అద్భుతంగా చేస్తారని చెప్పా. థ్యాంక్యూ శ్రీశాంత్ అన్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆయనను చూస్తే చాలా మోటివ్‌గా అనిపించింది. తెలుగులో ఎన్టీఆర్‌ సినిమాలో చిన్న అవకాశమొచ్చిన నటిస్తా'  అని అన్నారు.
  

Advertisement
Advertisement